23-12-2025 12:42:03 AM
దుబాయి, డిసెంబర్ 22 : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరింత దిగజారింది. సౌతాఫ్రికా చేతిలో 0-2తో పరాజ యం పాలైవడం తీవ్ర ప్రభావం చూ పగా.. ఇప్పుడు మిగిలిన జట్లు వరుస విజయాలతో భారత్‌ను వెనక్కి నెట్టేశాయి. తాజా జా బితాలో టీమిండియా 48.15 విజయశాతంతో ఆరోస్థానానికి పడిపోయింది. 2025 -27 సైకిల్‌కు సంబంధించి భారత్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. మరో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోగా.. ఒకటి డ్రాగా ముగిసింది.
సఫారీల చేతిలో ఓటమి తర్వాత భారత్ ప్లేస్ వరుసగా దిగజారుతూ వస్తోంది. తర్వాత జరగబోయే అన్ని సిరీస్‌లూ గెలిచినా కూడా భారత్ డ బ్ల్యూటీసీ ఫైనల్ చేరడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టాప్-2కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో కివీస్ 77.8 విజయశాతంతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా వంద విజయశాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోం ది. ఇంగ్లాండ్‌పై ఇప్పటికే ఆడిన యాషెస్ సిరీస్ మూడు టెస్టుల్లోనూ కంగారూలు భారీ విజయాలను అందుకున్నారు.
అలాగే సౌతాఫ్రికా 75 , శ్రీలంక 66.67 , పాకిస్తాన్ 50 విజయశాతంతో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంగ్లీష్ టీమ్ తాము ఆడిన 8 టెస్టుల్లో కేవలం రెం డు విజయాలే సాధించి 26 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. ఒక్క విజ యం కూడా సాధించని బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం సాధ్య మేనని పలువురు అంచనా వేస్తున్నా రు. మరో బెర్త్ కోసం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీలో ఉంటాయని భావిస్తున్నారు.