calender_icon.png 20 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు భారత్‌కు ఆహ్వానం

19-01-2026 01:20:34 AM

గాజాలో శాంతి స్థాపన దిశగా అడుగులు

వాషింగ్టన్: గాజాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (శాంతి మండలి)లో సభ్యత్వానికి భారత్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆదివారం రాత్రి ‘ఎక్స్’ ద్వారా ధ్రువీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఆహ్వాన లేఖ పంపించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో తాజా ఆహ్వానం ప్రా ధాన్యతను సంతరించుకుంది. మరోవైపు భారత్‌తో పాటు పాకిస్థాన్, జోర్డాన్, గ్రీస్, సైప్రస్ వంటి దేశాలకు కూడా ఈ ఆహ్వానం అందిం ది. బోర్డు సభ్యత్వం విషయంలో ఒక ఆసక్తికరమైన నిబంధన అంతర్జాతీయంగా చర్చనీ యాంశమైంది.