19-01-2026 01:22:30 AM
ఐదు వేలకు చేరిన మృతుల సంఖ్య
౨౪,౦౦౦ మంది నిరసనకారులు ఖైదు
టెహ్రాన్: ఇరాన్‌లో అణచివేత కొనసాగుతున్నది. ఖమేనీ ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నది. కిరాయికి తీసుకొచ్చిన ఇరాకీ ఫైటర్ల సాయంతో పౌరులను ఊచకోత కోయిస్తున్నది. అలా ఇప్పటివరకు ౫ వేల మంది నిరసనకారులు ప్రాణాలొదా రు. డిసెంబర్ 28న మొదలైన పౌరుల ఆందోళనలు ఇప్పుడు దేశమంతా విస్తరించాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కుర్దిష్ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. విదేశీ శక్తుల ప్రో ద్బలం తోనే ఈ అల్లర్లు జరుగుతున్నాయని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఆందోళనకారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విమర్శించారు. ఉగ్రవాదులు, అల్లరి మూకలు అమాయక పౌరులను లక్ష్యం గా చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. మరోవైపు మానవ హక్కుల సంస్థలు మృతు ల సంఖ్య 5వేల కంటే ఎక్కువగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 24 వేల మంది ని పోలీసులు అరెస్ట్ చేసి ఉండొచ్చని అంచనా. నిరసనకారులకు మరణశి క్షలు అమలు చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. 1979 ఇస్లామిక్ తిరుగుబాటు తర్వాత ఆ దేశం లో ఈ స్థాయిలో హింస జరగడం మొదటిసారి.