calender_icon.png 17 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కివీస్ దెబ్బకు దెబ్బ

15-01-2026 01:43:21 AM

రెండో వన్డేలో భారత్ ఓటమి

డారిల్ మిచెల్ సెంచరీ

రాజ్ కోట్‌లో సిరీస్ సమం

న్యూజిలాండ్ దెబ్బకు దెబ్బకొట్టింది. తొలి వన్డేలో గట్టి పోటీ ఇచ్చిన కివీస్ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేసింది. భారత్ బౌలర్లు ప్రభావం చూపలేని వేళ 285 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. ఇక సిరీస్ ఫలితం ఇండోర్ వేదికగా తేలనుంది.

రాజ్ కోట్, జనవరి 14 : తొలి వన్డే గెలిచిన జోష్‌తో రెండో మ్యాచ్ లోనూ జోరు చూపించి వన్డే సిరీస్ గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రాజ్‌కోట్ వేదిక గా జరిగిన రెండో వన్డే లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను సమం చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తక్కువ పరుగులకే అవుటవ్వడం.. శ్రేయస్ అయ్యర్ అనవసరంగా వికెట్ ఇచ్చుకున్నాడు. పవర్ ప్లేలో కూడా ఎక్కువ పరుగుల రాకుండా కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 24 , మరో హాఫ్ సెంచరీ చేసిన గిల్ 53 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 8, కోహ్లి అనవసర షాట్‌కు ప్రయత్నించి 29 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్, అయ్యర్, కోహ్లిని.. క్రిస్టియన్ క్లార్క్ పెవిలియన్‌కు పంపించాడు.118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 44 బంతు లు ఆడిన రవీంద్ర జడేజా 27 పరుగులకు వెనుదిరగ్గా,  నితీష్ కుమార్‌రెడ్డి - కేఎల్ రాహుల్ ఆరో వికె ట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే నితీష్ కుమార్‌రెడ్డి భారీ ఇన్నింగ్స్ గా మలచలేక  20 రన్స్‌కు పెవిలియన్ చేరాడు. ఒక వైపు వికెట్లు పడుతు న్నా కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేసి సెం చరీ సాధించాడు. మి డిలార్డర్‌లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ స్కోర్  అనవసర షాట్లకు యత్నించకుండా వీలు కుదిరినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

రాహుల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంత్ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు తీయగా.. జెమీసన్, ఫోక్స్, లెనాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.  285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కాన్వే (16), నికోలస్ (10) పరుగులకు ఔట్ అయ్యా రు. ఈ దశలో డారిల్  మిచెల్ , విల్ యంగ్ ఆదుకున్నారు. మూడో వికెట్‌కి 162 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా డారిల్  మిచెల్ అదిరిపోయే ఆటతో భారత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ యంగ్ (87) రన్స్‌కు ఔట్ అయినా మిచెల్ అదరగొట్టాడు. సెంచరీతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో న్యూజిలాండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యా న్ని చేరుకుంది. మిచెల్ 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ బౌలర్లు అసలు ప్రభావం చూపలేక పోవడం ఆశ్చర్యపరిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్ లో జరుగనుంది.