11-12-2024 12:14:20 AM
ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు బిజీబిజీ
అడిలైడ్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు 1 సమం చేశారు. అయితే మూడో టెస్టుకు మరో నాలుగు రోజులు సమయం ఉండడంతో రోహిత్ సేన పూర్తిగా ప్రాక్టీస్ సెషన్‌లో నిమగ్నమైంది. మంగళవారం అడిలైడ్ గ్రౌండ్‌లోనే భారత జట్టు రోజంతా బిజీబిజీగా గడిపింది.
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ లయను అందిపుచ్చుకునేందుకు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించాడు. స్పిన్నర్లు, పేసర్లతో బంతులు వేయించుకున్న రోహిత్ రిథమ్ అందుకునేందుకు చెమటోడ్చాడు. రోహిత్ గత 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశా డు. ఇక పెర్త్ టెస్టులో సెంచ రీ బాది టచ్‌లోకి వచ్చినట్లే అనిపించిన కోహ్లీ అడిలైడ్‌లో ఆఫ్ స్టంప్ బలహీ నతను మరోసారి బయటపెడుతూ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు.
రాహుల్ డిఫె న్స్ ఆడడంపై ఫోకస్ చేయగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కీపర్ రిషబ్ పంత్, గిల్ భారీ షాట్లు ఆడేందుకు ప్రాధాన్యమిచ్చారు. రెండు టెస్టుల్లోనూ అంతగా ఆకట్టుకోని హర్షిత్ రానాపై మూడో టెస్టులో వేటు పడే అవకాశముంది. బుమ్రా, సిరాజ్‌తో పాటు నితీశ్ కుమార్ ఎక్కువసేపు బంతులు విసరగా.. అశ్విన్, సుందర్, జడేజా త్రయం త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశారు.