24-09-2025 01:22:35 AM
-‘టి మొబైల్’ సీఈవోగా శ్రీనీ గోపాలన్
-‘మల్సోన్ కూర్స్’ సీఈవోగా రాహుల్ గోయల్
- అంతర్జాతీయంగా చర్చనీయాంశం
-ట్రంప్ హెచ్ వీసా దరఖాస్తు రుసుము పెంపు తర్వాత ఈ పరిణామం
-భారతీయుల శక్తి సామర్థ్యాలకిచ్చిన గౌరవమని మెచ్చుకోలు
వాషింగ్టన్, సెప్టెంబర్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచిన కొద్దిరోజులకే అమెరికాకు చెందిన టి మోల్సన్ కూర్స్ దిగ్గజ సంస్థలు తమ సంస్థలకు ఇద్దరు భారత సంతతికి చెందిన ఉద్యోగులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో)గా నియమించడం అంతర్జా తీయంగా చర్చనీయాశంమైంది. నియామకాలతో మరోసారి భారతీయుల శక్తి సామర్థ్యాలు బయటపడినట్లయిందని మీడియా లో కథనాలు వెలువడుతున్నాయి. టెలికాం టిఠ-మొబైల్ సీఈవోగా శ్రీనీ గోపాలన్, మల్సోన్ కూర్స్ బీర్ల తయారీ సంస్థ సీఈవోగా రాహుల్ గోయల్ నియమితుల య్యారు. ఈ ఇద్దరు ప్రతిభావంతులు, అమెరికాలో అత్యున్నత కార్పొరేట్ పదవులకు ఎంపిక కావడంపై భారతీయుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గోపాలన్ నేపథ్యం..
శ్రీనీ గోపాలన్ ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థి. ప్రస్తుతం ఆయన టి మొబైల్ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వరిస్తున్నారు. ఆయనకు టెలీ కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో అపార మైన అనుభవం ఉంది. గతంలో ఆయన డాయిష్ టెలికాం, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, యాక్సెంచర్, యూనిలీవర్ వంటి ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. టి-మొబైల్ సంస్థ సీఈవోగా ఆయన నవంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు
రాహుల్ గోయల్ నేపథ్యం..
రాహుల్ గోయల్ మైసూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. యూనివర్శిటీ ఆఫ్ డెన్వర్ నుంచి ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. మల్సోన్ కూర్స్ సంస్థలో 24 ఏళ్ల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. కార్పొరేట్ స్ట్రాటజీ విభాగంలో ఆయనకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. యూకే బిజినెస్‌కి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇండియా బిజినెస్‌కి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఆయన గతం లో సేవలందించారు. మల్సోన్ కూర్స్ సంస్థ తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పించింది. ఈయన అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.