03-12-2025 12:00:00 AM
-హార్థిక్ రీఎంట్రీ ఖాయం
-గిల్ పైనే సస్పెన్స్
ముంబై, డిసెంబర్ 2 :ఒకవైపు టీమిండి యా వన్డే సిరీస్‌తో బిజీగా ఉంటే మరోవైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. టీ20 ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఎంపికపైనే సస్పె న్స్ నెలకొంది. మెడనొప్పి నుంచి కోలుకున్న గిల్ ప్రస్తుతం బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.
అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ పాస యితేనే గిల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తా రు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్టుపైనే గిల్ ఎంపిక ఆధారపడి ఉంది. ఇక మిగిలిన జట్టులో హార్థిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయమైంది. ఆసియాకప్‌లో గాయపడిన తర్వాత రెండు నెలలుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన పాండ్యా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ బరిలోకి దిగాడు.
వస్తూనే పంజాబ్‌పై బ్యాట్‌తో అదరగొట్టాడు. అలాగే పాండ్యా రాకతో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశం లేదు.అటు గిల్ వస్తే జైశ్వాల్‌కు నిరాశే మిగులుతుంది.సంజూ శాంసన్, దూబే, తిలక్ వర్మ, జితే శ్ శర్మలకు చోటు ఖాయం. ఇక రియాన్ పరాగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశాలున్నాయి.
బౌలింగ్‌లో బుమ్రా తిరిగి రానుండగా.. అర్షదీప్, హర్షిత్ రాణా లు చోటు దక్కించుకోనున్నారు. స్పిన్ కోటా లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాజవ్, అక్షర్ పటేల్‌లు ఎంపికవుతారు. కాగా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి మొదలుకానుంది.