03-12-2025 12:00:00 AM
రంగంలోకి బీసీసీఐ సెలక్టర్ ఓజా
రాయ్‌పూర్, డిసెంబర్ 2 : భారత క్రికెట్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మధ్య ప్రస్తుతం తెరవెనుక గొడవ నడు స్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కది ద్దేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. దీని కోసం సెలక్టర్ ప్రగ్యాన్ ఓజాను రాయ్‌పూర్ కు పంపించింది.
ఎయిర్‌పోర్టులో ఓజా కో హ్లీతోనూ, తర్వాత గంభీర్‌తోనూ సీరియస్ గా చర్చిస్తున్న వీడియోలు వైరల్‌గా మారా యి. విజయ్ హజారేలో ఆడేందుకు కోహ్లీ నిరాకరించడం ఈ వివాదానికి కారణం రో హిత్ తాను విజయ్ హజారే టోర్నీలో ఆడతానని చెప్పగా.. కోహ్లీ మాత్రం నిరాకరి స్తు న్నాడు. దీనిపైనే గంభీర్‌తో కోహ్లీకి మధ్య వాగ్వాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
దేశవాళీ క్రికెట్ ఆడడంపై అందరికీ రూల్ ఒకటేనని ఒక ప్లేయర్‌కు మినహాయింపు ఇ వ్వడం కుదరదని గంభీర్ చెప్పగా.. ప్రస్తుతం కోహ్లీతో ఇదే అంశంపై సెలక్టర్ ఓజా చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డే సిరీస్ ముగిసేలో పు ఈ వివాదాన్ని పరిష్కరించాలని బీసీసీఐ భావిస్తోంది.