calender_icon.png 8 May, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పెంచికల్‌పేట్‌లో రెవెన్యూ సదస్సులు

07-05-2025 12:00:00 AM

సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 6 (విజయ క్రాంతి):భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం అమలులో భాగం గా  పెంచికల్ పెట్  మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించడం జరిగిందని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 7వ తేదీ వరకు దర్గోపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జనకాపూర్ గ్రామానికి దర్గోపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం, చెడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదిక, అగర్ గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో,  8, 9, 12 తేదీలలో పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోతేపల్లి, గుంట్ల పెట్ గ్రామాలకు సంబంధించి పోతేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం, లోడ్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం, మురళిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మురళిగూడ,

జిల్లెడ, తెల్లపల్లి గ్రామాలకు సంబంధించి మురళిగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో, 13, 14, 15 తేదీలలో బొంబాయిగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఎల్కపల్లి గ్రామపంచాయతీలోని ఎల్కపల్లి గ్రా మానికి సంబంధించి పెంచికల్పేట రైతు వేదికలో, కమ్మర్గాం గ్రామపంచాయతీ పరిధి లోని నందిగాం, కమ్మర్గాం, గుండెపల్లి గ్రా మాలకు సంబంధించి కమ్మర్గాం రైతువేదికలో, 16, 17, 19 తేదీలలో ఎల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో,

కొండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో, పంచికల్ పేట గ్రామపంచాయతీ పరిధిలోని పెంచికల్ పేట, కోయచిచాల, గన్నారం గ్రామాలకు పెంచికల్ పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలి పారు.

దరఖాస్తుదారులు నిర్ణీత తేదీల్లో సకాలంలో భూ సమస్యలకు సంబంధించి దర ఖాస్తులు చేసుకోవాలని, భూభారతి చట్టం ప్రకారం పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.