calender_icon.png 10 July, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి

09-07-2025 06:33:53 PM

కలెక్టర్ హనుమంతరావు...

వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) అన్నారు. గురువారం వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దశలవారీగా నిధులను అందించాలని, ఇసుక కొరత లేకుండా చూడాలని, ధరల నియంత్రణ కమిటీ ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  సూపరిండెంట్ నిరంజన్, ఏపీఎం జానీ, ఏపీవో పరశురాం, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉలిపే మల్లేశం, మాజీ ఎంపీటీసీ ఉద్ధగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.