calender_icon.png 28 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలు పడాలి.. పంటలు పండాలి

28-07-2025 12:35:22 AM

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ 

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు 

ఎల్బీనగర్, జులై 27 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం వాడవాడలా బోనాల ఉత్సవాలు ఘనంగా జ రిగాయి. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధలతో భక్తులు, మహిళలు, ప్రజాప్రతిని ధు లు, రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలోని ఎల్లమ్మ ఆలయంలో నిర్వ హించిన బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు మొద్దు లచ్చి రెడ్డి, నవజీవన్ రెడ్డి తదితరు లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగోల్ డివిజన్ పరిధిలో జరిగిన బో నాల ఉత్సవాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొని, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వా రు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను కోరుకున్నారు. ఆయా కార్య క్రమాల్లో బీజేపీ నాయకులు శ్రీధర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.