29-10-2025 05:06:48 PM
నిర్మల్ రూలర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో వచ్చేనెల 4న జిల్లాస్థాయి యువజనోత్సవాలు 2026 నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ యువజన ఉత్సవాల్లో 15 నుండి 19 వరకు యువకులు వ్యాసరచన ఉపన్యాస పోటీలు కళా రంగం సాహిత్యం తదితర రంగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ పోటీలో పాల్గొనేవారు పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.