23-10-2025 10:45:41 PM
మైనార్టీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా..
కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో ముస్లిం విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గోనాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2047 నాటికి దేశ స్వాతంత్రనికి 100 యేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలనుంచి తగు సలహాలు సూచనలు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ సిటిజన్ సర్వే నిర్వహిస్తుందని కావున ముస్లింలు తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఈ నెల 25 లోపు www.telangana.gov.in లేదా telanganarising వెబ్సైట్ నందు నమోదు చేయాలని కోరారు.