calender_icon.png 2 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ జంట ఆత్మహత్య

02-12-2025 01:51:22 AM

-రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఘటన

-మృతులు బీహార్‌కు చెందిన వలస కూలీలు

షాద్‌నగర్, డిసెంబర్1 (విజయక్రాంతి): ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం జరిగింది. బీహార్ నుంచి బతుకుతెరువు కోసం కొత్తూరు వలస వచ్చిన కార్మికుడు నవీన్ దత్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వారిలో ఒక రు అనామిక (21) ఓ కంపెనీలో పనిచేస్తున్నది. అందే కంపెనీలో పనిచేస్తున్న ధనుంజయ్ (25), అనామిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత మూడు రోజులుగా అనామిక కంపెనీకి వెళ్లడం లేదు. దీంతో సోమవారం అనామిక కోసం ధనుంజయ్ ఆమె ఇంటికి వెళ్లగా.. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించిం ది.

తీవ్ర మనస్థాపానికి గురైన ధనుంజయ్.. అదే ఇంట్లో తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నవనీత్ దత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. అయితే ఇంట్లో కనిపిస్తున్న సిసి కెమెరాకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అది సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. సంఘటన స్థలాన్ని శంషాబా ద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.