08-05-2025 12:44:53 AM
మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ‘కేంద్రం తాజాగా ఏపీకి సైనిక్ స్కూల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మూడు సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. కనీసం ఒక్క సైనిక్ స్కూలైనా కేటాయించలేదు. పైగా ఆయా స్కూళ్లలో తెలంగాణకు రిజర్వేషన్లను ఎత్తివేశారు.
అయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏమీ పట్టనట్లు ఉన్నారు’ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నిలదీశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ కూడా ఈ అంశంపై నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు.