calender_icon.png 9 May, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు గంజాయి విక్రయదారుల అరెస్టు

08-05-2025 12:44:28 AM

-వాహనం సీజ్

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి): ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బీ టీమ్ సభ్యులు, ముషీరా బాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ముషీరాబాద్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బి టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్త్స్ర శ్రీనివాస్, స్టేషన్ పరిధిలో లాలాగూడ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై అనుమాన స్పదంగా తిరుగుతున్న శివరాం (24), మహేందర్ (25)లను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకోని తనిఖీ నిర్వహించగా వారి వద్ద 1.2 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నామోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేశామని సీఐ రామకృ ష్ణ తెలిపారు.