calender_icon.png 24 September, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

24-09-2025 12:36:41 AM

అచ్చంపేట, సెప్టెంబర్ 23 అచ్చంపేట పట్టణంలో ఈనెల 28న ఆదివారం జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించి పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అయినప్పటికీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, అ నేక వాగ్దానాలు అమలు చేయలేదన్నారు.

ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది బహిరంగంగా సమాధానం చెప్పే సభ కానుందని తెలిపారు. బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు, పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్, పలు వురు నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.