19-05-2024 12:23:55 AM
ఉద్యాన పంటలతోనే రెండురెట్లు లాభం
ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి
గజ్వేల్, మే18(విజయక్రాంతి): ప్రస్తుతం వేగంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితులు తట్టుకునే వంగడాలను, ఆధునిక సాంకేతిక పద్ధతులను రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ కే అశోక్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ పరిశోధన, విస్తరణ సలహా సం ఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ఆయన ప్రసంగించారు. రోజురోజుకూ వాతావరణ పరిస్థితుల్లో భిన్నమైన మార్పులు వస్తున్నాయని, ఈ పరిణామమంలో అన్ని విధాలుగా తట్టుకునే వంగడాలను శాస్త్రవేత్తలు తయారుచేయాలన్నారు. ఉద్యాన పంటల సాగు వల్ల సంప్రదాయ పంటల కంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఈ విషయం మీద ఉద్యాన అధికారులు, విస్తరణాధికారులు రైతులకు అవగాహన కల్పిం చాలన్నారు. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కింద జరుగుతున్న పరిశోధనలు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించామన్నారు. ఎప్పటి కప్పుడు వివిధ పంటల్లో వచ్చే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను ఉద్యా న పంచాంగం, బ్రోచర్స్, రేడియో, టీవీ కార్యక్రమాల ద్వారా అందిస్తున్నామన్నారు. ఉద్యా న పంటల ఉత్పత్తుల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా పాడైపోవ టానికి అవకాశం ఉందని, దీనివల్ల నష్టశాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.
దీనికోసం పంటకోత అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు ఉద్యాన అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వివిధ పరిశోధన స్థానా లు, విస్తరణ విభాగం (కృషి విజ్ఞాన కేంద్రం) రూపొందించిన ఉద్యానపంటల సమాచారాన్ని అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు. దాంతో పాటు కేవీకే తయారు చేసిన కరివేపాకు, మునగాకు, గోరింటాకు పొడులను ఆయన పరిశీలించి ఇటువంటి ఉత్పత్తులను స్వయంసహాయక మహిళా సంఘాల ద్వారా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు. శాస్త్రవేత్తలు పరిశోధన, విస్తరణ ఫలితాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతులు, ఉద్యాన శాఖ అధికారులు వివిధ పంటలలో అడిగిన సమస్యలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు. అలాగే వారి సలహా మేరకు రాబో యే సంవత్సరానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. జనగామ నుంచి రైతు వై వెంకన్న మాట్లాడుతూ.. పంటలకు సబ్సిడీ మీద కూరగాయ విత్తనాలు, డ్రిప్, శాశ్వత పందిరిపై ఇచ్చి ఉద్యాన పంటల సాగును పెంచడానికి సహకారం అందించాలని కోరారు. సూర్యపేటకు చెందిన రైతు శేషుకుమార్ మాట్లాడుతూ.. సమీకృత వ్యవసాయ విధానాల ద్వారా రైతు సుస్థిర ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, వివిధ జిల్లాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.