15-05-2025 01:52:42 AM
మిల్లర్లతో రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం
హెచ్‌డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
అబ్దుల్లాపూర్‌మెట్, మే 14: వడ్ల కొనుగోలు కేంద్రాలను హెచ్‌డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని గౌరెల్లి, బండరావిరాల గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏర్పడిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ధాన్యం కొనుగోలపై ప్రత్యేకమైన శ్రద్ద చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వామని అన్నారు. రైతులు పండించిన పంటకు ప్రోత్సాహకంగా సన్నవడ్ల టన్నుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు తదితరులున్నారు.