calender_icon.png 10 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు

09-08-2025 04:49:30 PM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు..

వారం రోజులలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలి..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు శనివారం సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా సమీకృత కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సోలార్ విద్యుత్ వినియోగం, ఉత్పత్తి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల పై పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సెక్రెటరీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని,  ప్రతి జిల్లా కలెక్టర్ తమ జిల్లా పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలు,vవాటి పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలను వారం రోజులలో పంపాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంతో కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల  వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను వారం రోజులలో పంపాలని అన్నారు.  ఆర్వోఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం గిరిజనులకు పంపిణీ చేసిన 6 లక్షల 17 వేల ఎకరాల్లో సోలార్ పంప్ సెట్ లో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములలో సోలార్ పంపు సెట్ల ఏర్పాటు ప్రక్రియ మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుపై కలెక్టర్లు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో  డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.