calender_icon.png 21 January, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లలో తేడా..!?

21-01-2026 12:00:00 AM

పాలమూరు కార్పొరేషన్ లో రిజర్వేషన్లు తేడా నిజమా!

60 డివిజన్ ల కేటాయింపు తారుమారు అయ్యాయా?

రిజర్వేషన్ పై కోర్టు మెట్లు ఎక్కిన ఎస్సీ,ఎస్టీ సభ్యులు

తప్పని తేలితే కమిషనర్ పై వేటుపడేనా!

పాలమూరు కార్పొరేషన్ లో ఊపందుకున్న తీవ్ర చర్చ

మహబూబ్ నగర్, జనవరి 20 (విజయక్రాంతి) : మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలంటూ ఎస్సీ,ఎస్టీ సంఘాల సభ్యులు పాలమూరు కార్పొరేషన్ లోన్ ఇచ్చిన అం శం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. అలాంటివి జరగవు అనుకున్నప్పటికీ అసలు రిజర్వేషన్ సక్రమంగా జరిగాయా ఏ డివిజన్కు రావలసిన రిజర్వేషన్ అన్ని డివిజన్ లకు వచ్చా యా.. దీంతోపాటు అసలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల సంఖ్య ఎందుకు తగ్గింది అనే ప్ర శ్న కు సమాధానం చెప్పాలని రిజర్వేషన్లు ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ పై పలువురు హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తుం ది. దీంతో హైకోర్టు ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చలు జరిపి తప్పని తేలితే అధికారులు సై తం చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

- పాలమూర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు..

పాలమూరు కార్పొరేషన్ లో 60 డివిజన్లతో ఆవిష్కృతం కావడం జరిగింది. మొద టి కార్పొరేషన్ మేయర్ గా ఎంతోమంది పె ద్దలు ఆశించినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కార్పొరేషన్కు బీసీ మహిళ మేయర్ అభ్యర్థిగా రిజర్వేషన్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిం ది. ఇదిలా ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు రా వలసిన పూట మరింతగా ఉందని ఆయా సంఘాల సభ్యులు గట్టిగా నొక్కి చెబుతుండడంతో ఏ అంశానికి ప్రాధాన్యత వస్తుంది. ఈ 60 డివిజన్లో 16 ఎస్టీ మహిళ,15 జనరల్ గా రిజర్వేషన్ కేటాయింపు చేయగా, 5 డివిజన్ లు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంతోపాటు 5.9 డివిజన్లకు ఎస్సీ మహిళా, 6,10,18 డివిజన్ లకు ఎస్సీ జనరల్ రిజర్వేషన్లు కేటాయించారు.

23 డివిజన్ లలో బీ సీలకు, 16 డివిజన్లలో జనరల్ మహిళ, అన్ రిజర్వుడ్ గా మరో 14 డివిజన్లకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వేషన్లు డివిజన్లలో సక్రమం గా లేవంటూ చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందా తెలియకపోవడంతో ఈ చర్చ కార్పొరేషన్ లో మ రింత బలన్ని చేకూర్తుందని తెలుస్తుంది. ఎన్నికల నిబంధనలు సైతం సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ హోదా లో ఉండకూడదని ఎన్నికల సంఘం కూడా చెబుతుందని పలువురు పేర్కొంటున్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఏమి వస్తుందోనని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. 

-పాలమూర్ కమిషనర్ పై వేటుపడేనా!

వార్డుల వారిగా రిజర్వేషన్ల కేటాయింపు తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సైతం తగ్గాయని ఆరోపిస్తున్న వారు హైకోర్టు మెట్లు ఎ క్కడంతో ఈ చర్చకు మరింత పదును పెం చుతుంది. కోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం తప్పని తెలితే సంబంధిత మున్సిపల్ కమిషనర్ పై కూడా వేట పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కోర్టు జోక్యం లేనియెడల యధావిధిగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు మేధావులు చెబుతున్న మాట. నిబంధన మేరకు వార్డుల వారిగా కూడా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

నిబంధనల మేరకు ముందుకు...

 నియమ నిబంధనలను పాటించి వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేయ డం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్క సమాచారంతో అ న్ని విధానాలు అమలు చేస్తూ ఖరారు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలోని ఎన్నికలు జరుగుతాయి ఇలాంటి ఇబ్బంది ఉండదు. 

ప్రవీణ్ కుమార్ రెడ్డి, కమిషనర్, మహబూబ్ నగర్ కార్పొరేషన్