calender_icon.png 21 January, 2026 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం!

21-01-2026 12:05:19 AM

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ రూ.2.54 కోట్ల చెక్కులు పంపిణీ

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

సంగారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): మహిళా సాధికారత, పిల్లలకు నైపుణ్యాలతో కూడిన ప్రమాణవంతమైన విద్య, పేదల ఆరోగ్య భద్రతకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 2.54 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. పేదల ఆరోగ్య భద్రత, వైద్య రక్షణకు ప్రభు త్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. మహిళల ఉన్నతికి మహిళా సాధికారతకు పె ద్దపీట వేస్తూ, పిల్లలకు నైపుణ్యాలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు అవ సరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు. బాల భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమ లు చేస్తోందన్నారు. వయోవృద్ధుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుని డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. సం గారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. రాబోయే రోజుల్లో కంటి సంబంధిత కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు సహా ఆధునిక వైద్య సేవలను సంగారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అడగకుండానే ప్రజ లకు ఏం కావాలో తెలుసుకుని అందించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారు. ఇంటి స్థలం ఉన్నా లేకపోయినా ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ప్రజ లకు మెరుగైన సేవలు అందించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డిఓ రాజేందర్, డాక్టర్ మౌనిక, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంగారెడ్డి మున్సిపాలిటీకి మౌలిక వసతుల బలోపేతం

సంగారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక సదుపా యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారె డ్డి తెలిపారు.సంగారెడ్డి మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా రూ.31.70 కోట్ల వ్య యంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎండీ నిధులతో రూ.8 కోట్ల వ్యయంతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు, సీడీఎంఏ నిధులతో రాజీవ్ పార్క్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పథకం కింద రూ.18.70 కోట్లతో రోడ్లు, మురుగు కాలువలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చే పట్టనున్నారు. హెచ్‌ఎండీఏ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో రాజంపేట చౌరస్తా నుండి ఫిల్టర్ బెడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఫిల్టర్ బెడ్ మరమ్మత్తుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు బలోపేతం అయితే పట్టణాలు మరింత శుభ్రంగా, సురక్షితంగా మా రుతాయని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పరంగా ఆదర్శంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.