calender_icon.png 4 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టాలెక్కని ప్రజాపాలన!

04-08-2025 12:43:03 AM

  1. అరచేతిలో ప్రపంచమే అందుబాటులో ఉన్నా ప్రజలకు దొరకని జిల్లా సమాచారం
  2. శాఖల మధ్య కొరవడిన సమన్వయం 
  3. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం 
  4. కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలు 
  5. ఆయా శాఖల అధికారుల వసూళ్ల పర్వం

నాగర్ కర్నూల్ ఆగస్టు 3 (విజయక్రాంతి) ప్రశ్నించే ప్రతివారికి ప్రభుత్వం జవాబు దారిగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెప్తూ వస్తుంది. కానీ నాగర్ కర్నూ ల్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జిల్లాలోని ఏ శాఖ సమాచారం కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావ డం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పె రిగింది.

అందుకు ప్రభుత్వాలు కూడా ఈ ఫైలింగ్ అనే వ్యవస్థను తీసుకువచ్చి ఆయన శాఖల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, స మాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉం చేందుకు ఎన్‌ఐసి అనే వ్బుసైట్ ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరువలో ఉంచాల్సి ఉం ది. కానీ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్ర పంచమే అరచేతిలో ఉన్నప్పటికీ జిల్లాలోని ఆయా శాఖల సమాచారం మాత్రం అంతుచ్చిక్కడం లేదు.

కనీసం జిల్లాలోని అన్ని శాఖ ల అధికారుల పేర్లు, వారి సెల్ ఫోన్ నెంబ ర్లు కూడా సక్రమంగా పొందుపరచకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్‌ఐసి (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) విభాగం ఏం చేస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నా రు. గత ప్రభుత్వం జిల్లా కేంద్రానికి నూ తన కలెక్టరేట్ భవనం నిర్మించినప్పటికీ పట్టణానికి దూరంగా నిర్మించడంతో ఆయా సె ల్ఫో న్ సిగ్నల్ కూడా అందక అటు అధికారులు ఇటు సామాన్యులు తీవ్ర ఇబ్బందుల ను ఎ దుర్కొంటున్నారు.

మరి కొంతమంది అధికారులు అదే సాకుగా చూపి సామాన్యులను కార్యాలయాల చుట్టూ వాళ్ళ కాళ్లరిగే లా తి ప్పుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సా యంత్రం నాలుగు గంటల దాకా కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండా ల్సిన అధికారులు, క్రిందిస్తాయి సిబ్బంది కం టితుడుపుగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనూ ఇలా వచ్చి సంతకాలు చేసి వెంటనే ఫీల్ విసిట్ అంటూ సాకు చూపి ఇంటికి పయనమౌతున్నారని విమర్శలు ఉన్నాయి. మరికొంత మంది అధికారులు హైదరాబాద్ నుండి వ చ్చి వెళ్తుండడంతో ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు సైతం కొందరిపై చూసి చూడనట్లు వ్యవహరించడంతో అదే అలవాటుగా మలుచుకున్నారని విమర్శలు ఉన్నా యి.

ఎలాంటి అవగాహన లేని కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపుతున్నారని అందుకే ప్రజావాణిలో ప్రజలిచ్చే ఫిర్యాదు లు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. అటు ఆన్లైన్లో సమాచారం అందక కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక, ఫోన్ లైన్ లోనూ స్పందించక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజాసంఘాలు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. 

కొరవడిన పర్యవేక్షణ..!

ప్రతినెల ఆయా శాఖల పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించడం, కార్యాలయాల తనిఖీలు చేయకపోవడంతో ఆయా శాఖల అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నా యి. జిల్లా ఉన్నతాధికారులు ముఖ్యమైన సమావేశాలు, ఇతర పర్యటనలున్న సందర్భాల్లో మిగతా ఆయా శాఖల అధికారులు సైతం విధులకు డుమ్మా కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరి కొంతమంది అంతా తామే అంటూ ఉన్నతాధికా రుల పేర్లు చెప్పి అడ్డగోలుగా రెండు చేతుల సంపాదిస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వీకెండ్ శనివారం వస్తే మ ధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అన్ని కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నా ఉన్నతాధికారులు సైతం పట్టించుకో కపోవడం కట్ల అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి.

జిల్లా ఏర్పాటు నుండి ఇప్పటి వరకు ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ కనీసం జిల్లా ఉన్నతాధికారులకు సైతం సరైన సమాచారం ఇవ్వడం లేద న్న ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఉపాధి, వివిధ సంక్షే మ పథకాల సమాచారాన్ని ఆయా శాఖల వారీగా ఎన్‌ఐసిలో అందుబాటులో ఉంచా ల్సి ఉంది కానీ సుమారు ఐదేళ్ల కింది సమాచారమే కనిపిస్తుండడం విశేషం.

బదిలీపై వెళ్లిన వారు, రిటైర్మెంట్ అయిన అధికారుల పేర్లు సెల్ నెంబర్ పాతవే దర్శనమిస్తుండ డం అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షే మ పథకాలను కూడా ముడుపులిచ్చి పొం దాల్సిన పరిస్థితి దాపరించిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటే, వారు మౌనం పాటించడం ప్రజాపాలనపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని పలువురుఅంటున్నారు.