28-05-2025 12:04:28 AM
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఈనెల 22 నుంచి ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రధాన సబ్జెక్టు పరీక్షలు ముగిశాయి. మంగళవారం ఉదయం ఫస్టియర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరగ్గా, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు జరిగాయి. 28, 29న జరిగే పరీక్షలతో మొత్తం పరీక్షలు ముగిసినట్లవుతుంది.