28-05-2025 12:06:43 AM
ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
ఖైరతాబాద్; మే 27 (విజయక్రాంతి) : ఆద్య కళ, ఆది ధ్వని స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన ఉస్మానియా యూనివర్సిటీ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం ఆరట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి, ఓయూ ఓఎస్డి జితేంద్ర నాయక్ లకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి 200 కోట్లకు పైగా విలువ గలిగిన ప్రొఫెసర్స్ క్వాటర్స్ ని ఆద్య కళ, ఆది ద్వని సంస్థలకు అప్పనంగా 30 సంవత్సరాలు లీజు కు ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కబ్జాకు గురవుతున్న యూనివర్సిటీ భూములను కాపాడాల్సింది పోయి ఉన్న భూము లను బయట వ్యక్తులకు అప్పజెప్పడమేమిటని ప్రశ్నించారు.
జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ భూమి ని ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వకూడదని ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఎటువంటి ఓయూ భూములలో నిర్మాణాలు, మరమ్మతులు చేయకూడదని తెలుపుతుందని అన్నారు. ఓయూ అధికారులు ప్లీజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు దశలవారీగా విద్యార్థి సంఘాలు పోరాడుతూనే ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షులు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య, ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ అధ్యక్షులు కలకోటి ఉదయ్ కుమార్, కార్యదర్శి దండు అజయ్ కుమార్, పిడిఎస్యు ఓయూ ఇంచా ర్జ్ సోనబోయిన రాకేష్, విద్యార్థి నాయకులు అశ్వన్, హరీష్, కృష్ణ, మధు, సాయి ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.