calender_icon.png 2 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఇంటర్నేషనల్ లీగ్ టీ20

02-12-2025 01:43:50 AM

బరిలో భారత మాజీ క్రికెటర్లు

దుబాయి, డిసెంబర్ 1 : అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ మంగళవారం నుంచే ప్రారంభం కా బోతోంది. గత ఏడాది ఫైనలిస్టులు దుబా యి క్యాపిటల్స్, డిసర్ట్ వైపర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయి. దుబాయి క్యాపిటల్స్, డిసర్ట్ వైపర్స్, అబుదాబీ నైట్ రైడర్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్లు టోర్నీలో ఆడుతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెం దిన ఓనర్లే ఈ లీగ్ ఫ్రాంచైజీల్లోనూ పెట్టుబడులు పెట్టారు.

కాగా ఈ సారి భారత మాజీ క్రికెటర్లు కూడా ఐఎల్ టీ20 ఆడుతున్నారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తొలిసారి లీగ్‌లో ఆడబోతున్నాడు. దినేశ్ కార్తీక్ షార్జా వారియర్జ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అలాగే భారత అండర్19 మాజీ కెప్టెన్, అమెరికా ప్లేయర్ ఉన్ముక్త్ చాం ద్. మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా అబుదాబీ నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగుతు న్నారు. టీ20 ఫార్మాట్‌లో స్టార్స్‌గా ఉన్న పొల్లార్డ్, పెర్గ్యూసన్, హోల్డర్,టిమ్ సౌథీ, జిమ్మీ నీషమ్, ఫిల్ సాల్ట్, రూథరఫర్డ్ వంటి ప్లేయర్స్ ఐఎల్ టీ20 లీగ్ ఆడుతున్నారు.