26-05-2025 07:14:24 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అంతర్జాతీయ అంబులెన్స్ పైలట్ల దినోత్సవ వేడుకలను సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 108 కార్యాలయంలో జిల్లా మేనేజర్ బత్తిని మహేష్(District Manager Bathini Mahesh) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 108 అంబులెన్స్ పైలెట్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ క్షతగాత్రులను గోల్డెన్ అవర్లో హాస్పటల్ కు తీసుకువెళ్లడంలో ప్రధాన భూమికను పోషించాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న పలువురు పైలట్లను ఘనంగా సన్మానించి వారిచే కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో పైలట్లు చాపల శివప్రసాద్, బూర్గుల రమేష్, నెహ్రు నాయక్, సతీష్, ప్రేమ్ చంద్, సంతోష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.