calender_icon.png 4 August, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి

25-07-2025 02:08:01 AM

బోయినపల్లి :జూలై 24(విజయక్రాంతి) ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరువులు ఫ ర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళ రైతులకు రైతులకు ఉత్తమ సేవలు అందించే గొప్ప అవకాశం వచ్చిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం బోయిన్పల్లి మండలం బోయినపల్లి విలాసాగర్ గ్రామాల్లోని గ్రామ ఐక్య సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన ఎరువుల మరియు విత్తనాల దుకాణాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రారంభించారు.

అనంతరం ని ర్వహించిన గ్రామ ఐక్య సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు డైరీ యూనిట్లు కోడి పిల్లల పెంపకం ఆర్టిసి బస్సుల కింద ఉపాధి స్వయం ఉపాధి యూనిట్లను అం దించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు ఇచ్చేందుకు ఏ ర్పాటు చేసినట్లు,ఆయన తెలిపారు.

జిల్లాలోని మొత్తం 23 దుకాణాల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేయమని, ఇందులో భాగంగా ఇప్పటికే మూడు దుకాణాలు ప్రారం భించామని చెప్పారు. ఎరువులు పురుగుమందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు పురుగుమందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయాలని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం ప్రవేశపెట్టి మహిళా సంఘాలకు పెద్దపీట విస్తులు చెప్పారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏవో ప్రణీత, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్,ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి,జిల్లా బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కనకయ్య సంబ లక్ష్మీరాజం, రవీందర్‌తదితరులున్నారు.