calender_icon.png 29 May, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి

27-05-2025 07:28:12 PM

ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్..

ములుగు/మహబూబాబాద్ (విజయక్రాంతి): కేసుల దర్యాప్తులో ముమ్మరంగా నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని, కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో  సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వారిగా కేసుల నమోదు విచారణ తీరుపై ఆరా తీశారు.

వచ్చే వర్షాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తు ముమ్మరం చేయాలని పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు కిషోర్ కుమార్, రవీందర్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.