calender_icon.png 14 October, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌతాఫ్రికా హ్యాట్రిక్ విక్టరీ

14-10-2025 12:32:47 AM

విశాఖపట్నం,అక్టోబర్ 13 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది.  ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తడ బడుతూ సా గింది. కేవలం 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కాప్(56), ట్రియోన్ (62) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.

చివ ర్లో వీరిద్దరూ ఔటవడంతో మ్యా చ్ ఉత్కంఠగా మారింది. అయితే భారత్‌పై మెరుపులు మెరిపించిన డిక్లార్క్ మరోసారి అదరగొట్టింది. 29 బంతుల్లో 37(4 ఫోర్లు, 1 సిక్స్) తో జట్టును గెలిపించింది. దీంతో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దక్షిణాఫ్రికా పా యింట్ల పట్టికలో మూడో ప్లేస్‌కు చేరింది.