calender_icon.png 7 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతులు అందని ద్రాక్షేనా?

22-03-2025 12:00:00 AM

డా. ఎస్. విజయ భాస్కర్ :

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 25 సంవత్సరాలు గడిచినా పదోన్నతులు లేవు. 2000 సంవత్సరంలో, అంతకు ముందు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో నియామకం పొందిన ఉపాధ్యాయులు ఎ లాంటి పదోన్నతులకు నోచుకోవడం లేదు.

ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లుగా పాఠశాల విద్యలో చేరిన ఉపాధ్యాయులు అదే హోదాల్లో పదవీ విరమణ చేయడం ఆందోళనకరమైన విషయం. ఎస్జీటీ ఉపాధ్యాయులు అనేక మంది డిగ్రీ, పీజీలు, పీహెచ్‌డీలు, బిఎడ్., ఎంఎడ్, టెట్, స్లెట్, నెట్, జేఆర్.ఎఫ్, డిపార్ట్‌మెంట్ పరీక్షలు అ న్నీ ఉత్తీర్ణత సాధించినా పదోన్నతులు మాత్రం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ శిష్యులు, తాము శిక్షణ ఇస్తే ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కళాశాల లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ లాంటి అనేక ఉద్యోగాలు వస్తున్నా ఎస్జీటీ ఉపాధ్యాయు స్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గణితం, భౌతిక ,జీవశాస్త్ర సబ్జెక్ట్‌లలో బీఎడ్‌లో థర్డ్ మెథడాలజి,పీజీ కోర్సులు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ కాలం లో మూడు పదోన్నతులు ఇవ్వాలని చెప్పి నా ఆచరణలో మాత్రం అమలు కావ డం లేదు. కనీసం ఒక్క పదోన్నతి కూడా లభించక పోవడం ఎస్జీటీ ఉపాధ్యాయులలో ని రాశ, నిస్పృహలకు గురి చేస్తోంది.

2000 సంవత్సరానికి ముందు పాఠశాల ఉపాధ్యాయులు గా చేరిన ఉపాధ్యాయులకు డి ప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్, డి ప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖాధికారులు, జూనియర్ లెక్చరర్స్, డైట్ కళాశా లల్లో లెక్చరర్స్,బీఎడ్ కళాశాలలలో లెక్చరర్స్,సిటిఈ, ఐఎఎస్‌ఈ, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) మొదలైన అనేక రకాల అవకాశాలు ఉండేవి.

ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వే ర్వేరు మేనేజ్‌మెంట్ వారీగా పదో న్నతు లు ఇచ్చేవారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంభవం కాని కా మన్ సర్వీస్ రూల్స్ అంటూ ఉపాధ్యాయులలో లేని పోని ఆశలు రెకెత్తించి అసలుకే మోసం తీసుకు వచ్చారు. 

రెండున్నర దశాబ్దాలుగా..

గత రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు పదోన్న తులు లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిపోతోంది.గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ఆసక్తి చూపకపోవడం, నిర్లక్ష్య నిర్లిప్తత ధోరణి ప్రదర్శిం చడం వలన ఉపాధ్యాయుల పదోన్నతుల అంశం పరిష్కారం కాలేదు.

రేవంత్ సర్కా ర్ విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తోంది. గత ఎన్నో సంవత్సరాలుగా లేని బదిలీ లు, పదోన్నతులు ఇవ్వడం, టెట్ నిర్వహించడం, కొత్త ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం, ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొని రావడానికి అమ్మ ఆద ర్శ పాఠశాలల పేరిట నిధులను మంజూ రు చేస్తోంది.

పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడాని కి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారం భించను న్నట్లు ప్రకటించడంతో ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయెమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని దేశీయ భాషలైన (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరా ఠీ వంటివి ) భాషలను బోధించే ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకొని వెట్టిచాకిరికి, శ్రమదోపిడికి గురైనారు.

భాషా పండిత సంఘాలు ముఖ్యం గా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) తెలంగాణ ముఖ్యమంత్రులను, విద్యా శాఖ మంత్రులను, ఆ శాఖ ప్రధాన కార్యదర్శులను, సంబంధిత అధికారులను కలిసి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరడం, భాష పండితులకు పదో న్నతులు కల్పించడానికి  అనేక సార్లు జీవో లు ఇవ్వడం, ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులు పదోన్నతులలో తమకు వాటా ఇవ్వాలని కోర్టు లకు వెళ్ళడం జరుగుతుండేది.

రేవం త్ సర్కార్ జోక్యం చేసుకొని హైకోర్టు లో పండితులకు అనుకూలంగా ఉత్తర్వులు సా ధించగలిగారు. ఎస్జీటీ ఉపాధ్యాయు లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్తే అక్కడ ప్రభుత్వం తరుపున న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయ వాది జి.ఉమారాణిని నియమించుకొని పండితుల పోస్టులను పండితులకే ఇవ్వాలని ఉత్తర్వులు సాధించగలిగారు.

రాజు తలచుకుంటే అన్న చందంగా గత మూడు దశాబ్దాలుగా పదోన్నతులకు నోచుకోని పండితుల సమస్య పరిష్కరించి పీఈటీ, భాషా పండితులకు దాదాపు 10 వేలకుపై గా పోస్టులలో పదోన్నతులు  కల్పించారు.

పండిత వ్యవస్థను రద్దు చేయాలి

తెలంగాణలోని భాషాపండిత వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్రంలోని ఉపా ధ్యాయ సంఘాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పది వేలకు పైగా భాషా పండితులకు,పీఈటీ లకు పదోన్నతులు కల్పించినా,ఇంకా తొ మ్మిది వందల వరకు భాషా పండితులు పదోన్నతులు రాక మిగిలి పోయారు. డీఎస్సీ 2024లో మరికొంత మందిని భాష పండితులుగా నియామకాలు చే సింది. తెలంగాణ రాష్ట్రంలో భాషా పం డిత వ్యవస్థను రద్దు చేయాలని, అప్‌గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ భాషా పండితులను నియమించడంలో అర్థం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారం కావాలి-

గత రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తు న్న ఉపాధ్యాయులు కామన్ సర్వీస్ రూల్స్ అంటూ, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో సర్వీస్ రూల్స్ దేనికి అవే ఉం డాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కో ర్టు , సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అనేక మంది ఉపా ధ్యాయులు అత్యున్నత డిగ్రీ లు చేసి అన్ని అర్హతలు సాధించి ఎలాంటి పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేశారు.

ఇ ప్పటికైన రేవంత్ సర్కార్ ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న కామ న్ సర్వీస్ రూల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితే గత రెండు దశాబ్దాలకు పైగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూ ల్స్, డి ప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) లలో ఉపాధ్యాయులు, ఉపన్యాస కులు (లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్), ఆచార్యులు  (ప్రొఫెసర్లు) పోస్టులను భర్తీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

డైట్ కళాశాలలకు పూర్వ వైభవం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులను నియమించడానికి డైట్ కళాశాలల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుం ది. గత రెండు దశాబ్దాలకు పైగా డైట్ కళాశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి కానీ సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉపాధ్యాయ శిక్షణ నామమా త్రంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పుం డు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పె ట్టినట్లు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యం గా రేవంత్ సర్కార్ భాష పండితుల సమ స్య పరిష్కారం చేసినట్లు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారి కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కారం చేస్తే అనేక మంది ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మా ర్పులు వస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో రెట్టింపు ఉత్సా హంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తారు. డైట్ కళాశాలలకు పూర్వవైభవం వస్తుంది.

 వ్యాసకర్త సెల్: 9290826988