calender_icon.png 10 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణ కమిటీని ప్రభావితం చేసే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు

10-11-2025 01:29:36 AM

100 కోట్ల భూ ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుమానం 

జగిత్యాల అర్బన్, నవంబర్ 9 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో 100 కోట్ల భూ అక్రమణ వ్యవహారంపై విచారణ కోసం జిల్లా కలెక్టర్ కమిటీ వేశారని, అయితే ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 138 సర్వే నెంబర్ లోని భూమి సదరు వ్యాపారి కి వారసత్వంగా వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలెక్టర్ వేసిన విచారణ కమిటీని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మా ట్లాడుతూ చట్టసభలకు ఎన్నికైన వ్యక్తులుగా ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందన్నారు.

గతంలో తాను ఎస్సారెస్పీ భూములను, దేవాదాయ శాఖ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడడం వల్లే ఇప్పుడు ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. జగిత్యాల పట్టణంలో అత్యంత విలువైన మున్సిపల్ భూమిని కాపాడడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. 1952 సంవత్స రంలో దారం వీర మల్లయ్య అనే వ్యాపారికి ప్రజా అవసరాల కోసం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ నిర్వహణకు 20 గుంటల స్థలాన్ని మున్సిపాలిటీ కొన్ని షరతులతో అప్పగించిందని తెలిపారు. 1964 లో స్థల వినియోగదారుడైన దారం వీర మల్లయ్య భవన నిర్మాణం కోసం మున్సిపల్ కు దరఖాస్తు చేసుకోగా వివాదం తలెత్తి బాల వీరే శం బిల్డింగ్ కమిటీ చైర్మన్ గా ఓ కమిటీని వేశారని తెలిపారు.

యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలను మున్సిపల్ కు సమర్పించాలని ఆ కమిటీ దారం వీర మల్లయ్య ను కోరినప్పటికీ ఆయన జీవిత కా లంలో ఎలాంటి పత్రాలను మున్సిపాలిటీకి సమర్పించలేదని తెలిపారు. 1975లో దారం వీర మల్లయ్య మరణించిన అనంతరమే ఆయన వారసులు అనే డాక్యుమెంటు జిరా క్స్ కాపీని తెరమీదికి తెచ్చి స్థానిక కోర్టులో ఇంజక్షన్ సూటు వేశారని జీవన్ రెడ్డి తెలిపారు. ఖిలిపారు అనే పత్రంతో ఏ కోర్టులో కూడా యాజమాన్య హక్కుల కోసం దావా వేయలేదని కేవలం తమ కబ్జాను తొలగించవద్దని మాత్రమే సూటు వేసి ఇంజక్షన్ ఆర్డర్ తో ఇంతకాలం ఆ స్థలంలో కొనసాగుతూ వస్తున్నారని వివరించారు. 100 రూపాయ ల కంటే ఎక్కువ విలువైన ఆస్తి మార్పిడి జరగాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించా లని చట్టం ఉందని, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఖికుండా పత్రం ద్వారా ఆ భూమి కి యాజమాన్య హక్కులు ఎలా వస్తాయని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిస్తూ కిబాలా జిరాక్స్ పత్రం ఆధారంగా పూర్తి విచారణ జరపలేమ ని, మునిసిపాలిటీ తన భూమిని స్వాధీనం చేసుకునే వరకు పొజిషన్ లో కొనసాగవచ్చని మాత్రమే తీర్పునిచ్చిందని, యాజమా న్య హక్కును నిరూపించుకునే బాధ్యతను సదరు వ్యాపారిపైనే ఉంచిందని తెలిపారు. కొంతమంది మున్సిపల్ అధికారులు లా లూచీపడి సదరు భూమిలో షాపింగ్ కాం ప్లెక్స్, ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇ చ్చారని దీనిపై విచారణ జరిపి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్లు, అధికారులపై చర్యలు తీ సుకొని వారి పెన్షన్ను జప్తు చేయాలని జీ వన్ రెడ్డి డిమాండ్ చేశారు. భూ కబ్జా విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వైఖరిని స్పష్టం చేయాలని... ప్రజా ఆస్తుల ప రిరక్షణలో తాను వ్యాపారికి మద్దతిస్తాడా ప్ర జా పక్షంవైపు నిలబడతాడా అనేది ఎమ్మెల్యే తేల్చుకోవాలని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.

పబ్లిక్ నోటీస్ పై జీవన్ రెడ్డి మండిపాటు...

పెట్రోల్ బంక్ యజమాని మంచాల కృష్ణ పాత్రికేయులను,ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురి చేసేలా న్యాయవాది ద్వారా పబ్లిక్ నోటీసు ఇవ్వడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి తప్పు అయినా తనకు నోటీసులు ఇస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసే విధం గా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, దుర్గయ్య, అశోక్, రాధాకృష్ణ, గుండ మధు, బీరం రాజేష్ తదితరులుపాల్గొన్నారు.