20-01-2026 12:01:49 AM
ధనికుల కోసం పార్టీల వెతుకులాట
మహబూబాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు కాసులున్నోళ్లకే కౌన్సిలర్ టికెట్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ధనికులను గుర్తించి వార్డుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి కసరత్తు మొదలెట్టినట్లు విస్తృతంగా ప్రచా రం సాగుతోంది. ఇంతకాలం పార్టీ జెండాలు మోసిన సామాన్య కార్యకర్తలకు, నాయకులకు పైసల్లేవనే సాకు తో టిక్కెట్ ఇవ్వకుండా ‘మొండి చెయ్యి’ చూపిస్తూ, పోటీకి నిలబెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న మున్సిపాలిటీలో అయితే కనీసం 15 లక్షల నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత ఉన్న వారికే టిక్కట్ల కేటాయింపులో మొదటి ప్రా ధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. ఇక రిజర్వేషన్ల ప్రకారం ఆయా వార్డు కౌన్సిలర్ పదవితోపాటు మున్సిపల్ చైర్ ప ర్సన్ పదవికి ఎన్నికకు రెండు నుంచి మూ డు కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టే వారిని తెరపైకి తెస్తున్నారు.
రాజకీయాల్లో ఇప్పటివరకు ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న వారికి రిజర్వేషన్ల కారణంగా పూ ర్తి చేసే అవకాశం లేని నేతలు తమ స్నే హితులు, బందు వర్గాన్ని ఎన్నికల బరిలో నిలపడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టే స్థోమత ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నవారికి పార్టీల నేత లు అన్ని మేము చూసుకుంటాం.. గెలిపించి పదవిలో కూర్చోబెడతామంటూ ‘గాలం’ వే స్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
ఉమ్మడి వ రంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మేడారంలో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్లో ఎంత వీలైతే అంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో మున్సిపల్ ఎ న్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. దీనితో అధి కార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష, ఇతర రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో విజయం సా ధించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఆర్థిక, అంగ బలం, రాజకీయ చతురత కలిగిన నేతలను, గెలుపు గుర్రాలను గుర్తిస్తూ ఎన్నికల బరిలో నిలపడానికి శ్రీకారం చుట్టాయి. పార్టీ గుర్తులతో నిర్వహించే ఎన్నికల నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు అధికార కాంగ్రెస్ నేతలు ము మ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో విజ యం సాధించే బాధ్యతను జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యే లు తలకెత్తుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్ ఎన్నికలుగా పేర్కొనడంతో ఆ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల విజయానికి తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది.
ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో ధన బలం ఉన్నవారికి మళ్ళీ ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించే పరిస్థితి కనిపిస్తుందని సామా న్య నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. తాము టికెట్ల కోసం పెద్ద నేతలను కలిస్తే ఏ మాత్రం డబ్బులు ఉన్నాయేమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారని కొందరు గల్లి స్థాయి నాయకులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిల ర్ పదవికి కూడా తాము కొరగామా అం టూ ప్రశ్నిస్తున్నారు.