calender_icon.png 20 January, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా @ 300

20-01-2026 12:21:58 AM

  1. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయం

రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

నాగర్ కర్నూల్ జనవరి 19 విజయక్రాంతినాగర్ కర్నూల్ జిల్లాలో  ఫర్టిలైజర్స్, ఫెస్టి సైడ్స్ దుకాణదారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి అత్యధిక ధర కు విక్రయాలు జరుపుతున్నారు. ఒక బస్తా 266 రూపాయలు ఉండగా రూ 34 అదనంగా 300 ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నా రు. ఓ పక్క యూరియా కొరత లేదంటూ మండలాల వారిగా ఆయా దుకాణాలు ప్రాథమిక సహకార సంఘం కేంద్రాల్లో యూరియా నిలువల వివరాలను ప్రతిని త్యం వెల్లడిస్తున్నారు.

అయినా అక్కడక్కడ వ్యాపారులు యూరియా కొనుగోళ్ల విషయంలో కొర్రీలు పెట్టి రైతులను నిత్యం తమ దుకాణాల చుట్టూ తిప్పుకుంటున్నారు. కౌ లుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది మొక్కజొన్న సాగు చేస్తున్న సదరు రైతు ఎకరాకు మూడు బస్తాలు యూరియా పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు మాత్రం రెం డు బస్తాలే వాడాలని చెప్తున్నారు.

అయినా పట్టా పొందిన రైతు మాత్రమే కొనుగోలు చేయాలని లేదా సదరు రైతు ఓటిపి చెబితేనే యూరియా అందుతుందని కొర్రీలు పెట్టడంతో కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోత్రంగా మారింది. ఓ పక్క అత్యధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని చెప్తూనే ఇలాంటి కొర్రీలు పెట్టడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది.

ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవే టు వ్యాపారులు యూరియాను అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని మండలాల వారిగా ఆయా దుకాణంలో యూరియా అందుబాటులో ఉన్న ప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టి స్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. ఇదేంటని అడిగిన కొంతమం ది రైతులకు హమాలీ చార్జ్, ఆటో ఛార్జ్ అం టూ బుకాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అందుబాటులో ఉన్నా క్యూ లైన్ లో రైతులు 

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం మొక్కజొన్న వ రి పంటలు సాగు చేస్తున్న రైతులకు యూ రియా తప్పనిసరి. ప్రతి ఎకరా మొక్కజొన్న పంటకు రెండు బస్తాలు మాత్రమే వినియోగించాలని అధికారులు చెబుతుండగా రైతు లు మాత్రం రెండు బస్తాలు సరిపోదని పం ట చేతికొచ్చే వరకు ఎకరాకు మూడు బస్తా లు తప్పనిసరి వాడాల్సిందని రైతులు చెప్తున్నారు.

ఈ ఆసంగిలో  4.57 లక్షల యూరి యా బస్తాలు పంపిణీ చేయగా గతం కంటే ఈ ఏడాది  1.52 లక్షల బస్తాల యూరియా పంపిణీ అదనంగా జరిగిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,210 యూరియా బస్తాలు ఆయా మండలాల వా రిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పత్రికా ప్రకటన వి డుదల చేశారు. అయినా ఆయా ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణదారుల ముందు భారీగా రైతులు యూరియా బస్తాల కోసం క్యూలో నిలుచున్నారు.

అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీలో ఆలస్యం వెనక అధిక ధరకు విక్రయించాలన్న కుట్రలో భాగమేనని ఈ విష యాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.  నాగర్ కర్నూల్ జి ల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద సోమవారం రైతులు యూరియా కో సం క్యూ లైన్ లో నిలుచున్నారు ఒక్కో బస్తా 300 చొప్పున వసూలు చేయడంతో రైతు లు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మొదటి తప్పుగా క్షమించి వదిలేసామని మరోసారి ఎక్కువ ధర అమ్మకూడదని సున్నితంగా చెప్పి వెళ్లిపోవడం విశేషం. 

అధికారుల అండతోనే అధిక ధరలకు విక్రయాలు 

 నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణదారులు అధికారుల కన్సర్లలోనే పనిచేస్తున్నారని సర్వత్ర విమర్శ లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న యూరి యా సమస్యను కూడా వ్యాపారులు కృత్రి మ కొరత సృష్టించి అధిక ధరలు దండుకోవడంపై ఆయా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు అయినా ఇవేమీ పట్టనట్లు ధన దాహంతో వ్యాపారులు రైతులను అడ్డగోలుగా ముంచుతున్నారని మండిపడుతు న్నారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని దుకాణదారు ఏకంగా బహిరంగంగా లారీలోని యూరియాను అమ్ముకున్నాడు.

అయి నా కొద్ది రోజులు మాత్రమే దుకాణాన్ని సీజ్ చేసి తిరిగి ఎదవ వదిలేసారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద నాగార్జున ఫర్టిలైజర్ దుకాణ గారు అత్యధిక ద్వారా విక్రయించాడు. యూరి యా బస్తా తో పాటు ఇతర మందులను తప్పనిసరి కొనుగోలు చేయాలని షరతులు విధించాడు దీనిపై అప్పట్లో ఫిర్యాదులు అం దగా కేవలం మందలించి వదిలేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణదారులు రైతులను ముక్కు పిండి వసూలు చేస్తున్న అధికారులు కంటిచూపుగా వ్యవహరించడంతో పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. 

 4 బస్తాల కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్న

 నాకున్న ఐదు ఎకరాల్లో మరో ఆరు ఎకరాలు కౌ లుకు తీసుకొని వరి మొక్కజొన్న సాగు చేశా మొద ట ఐదు బస్తాలు యూరియా కొనుగోలు చేసి పంటకు వేసుకోగా మరో నాలుగు బస్తాలు అవసరం ఉందని నాలుగు రోజులుగా తి రుగుతున్న అయినా ఎక్కడ యూరియా దొరకటం లేదు. 

 గోపాల శ్రీశైలం, రైతు, వనపట్ల, నాగర్ కర్నూల్ జిల్లా