02-09-2025 12:20:44 AM
వరదలు వస్తే రోజుల తరబడి ప్రజలకు తప్పని ఇబ్బందులు
వరదల సమయంలో హడావుడితో సరిపెడుతున్న పాలకులు
ఆ తర్వాత పట్టించుకునే దిక్కులేదు
వనపర్తి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి ): ప్రతి సంవత్సరం వానకాలం వరదల వస్తే చాలు ప్రజలకు, వాహనదారులకు రాకపోక లు నిలిచిపోవడం జిల్లాలో సర్వసాధారణమైంది. వరదల వల్ల కలిగే సమస్యలకు శ్వా శ్వత పరిష్కారం కోసం కల్వర్టు లను నిర్మించాలని శంకుస్థాపన లు పనులను ప్రారం భించి వాటి నిర్మాణం లు మధ్యలో వదిలేసి నా అట్టి పనులపై పాలకుల పట్టింపు లే కుండా పోయిందన్నా విమర్శలు ప్రజల నుండి బహిరంగంగా వినిపిస్తున్న మాటలు.
జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో ప్రమాదపుకారంగా ఉన్న కల్వర్టులపై భారీ వర్షాల కు వరద ప్రవహిస్తుండడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతున్న విషయం అందరికి తెలిసిందే. వరదలు వచ్చినప్పుడు మాత్రం ప్రత్యామ్నాయంగా హడావిడితో సరిపెడుతున్న పాలకులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నా విమర్శలు బలంగా విని పిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే త ప్ప ఈ కల్వర్టులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ముందస్తు చర్యలు చేపడితే ప్రజలకు రవాణా సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది.
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిల నిర్మా ణ పనులు జిల్లాలోని పలు మండలాలలో ప్రధాన రోడ్లపై ఉన్న బ్రిడ్జిల నిర్మాణ పనులు బిల్లులు రాక అసంపూర్తిగా మద్యలోనే వదిలేశారు.
వీపనగండ్ల
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామ సమీపంలో ఊర చెరువు వాగుపై ని ర్మించిన బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు మండల ప్రజలు అ నేక ఇబ్బందులకు గురవుతున్నారు. 2023 లో కోటి 23 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లులు రాక కాంట్రాక్టర్ మద్యలోనే పనులు నిలిపివేశారు. 2 సంవత్స రాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. భారీ వర్షాలు కురి సినప్పుడు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
మదనపూర్
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలంలోని ఊకచెట్టు వా గుపై బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరం లో రూ.9 కోట్ల 25 లక్షలతో అప్పటి ప్రభు త్వం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలం లో పనులు మొదలు పెట్టకపోవడంతో తిరి గి 2021లో రీ టెండర్లు వేశారు. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి 2022 చివరలో పనులు మొదలు పెట్టగా మొత్తం 19 పిల్లర్ల వరకు ని ర్మాణం పూర్తి అయింది.
బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు వేయడానికి సుమారు రూ.5 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూ రు కాక బ్రిడ్జి అసంపూర్తిగా మిగిలిపోయింది. ప్రతి ఏటా బారి వర్షాలకు సరళ సాగర్ ప్రా జెక్టు నుండి ఉక చెట్టు వాగు ఉదృతంగా ప్రవహించి లో లెవెల్ వంతెన ఉండటంతో వనపర్తి ఆత్మకూరుకు ప్రధాన రహదారి కావడంతో వివిధ పనుల నిమిత్తం వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సెప్టెంబర్ 2022లో రహదారిపై నీరు పారుతున్నప్పు డు వరద ఉధృతి గమనించక ఆత్మకూరుకు చెందిన ఓ ప్రైవేటు లెక్చరర్ బైక్ పై వెళ్తుండగా వాగులో కొట్టుకుపోయి మరణించా డు. ఒక నెల రోజుల వ్యవధిలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీళ్లలో కొట్టుకపో యి చనిపోయారు.ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
శ్రీరంగాపురం
వనపర్తి నియోజకవర్గం శ్రీ రంగాపురం మండల పరిధిలో షేర్ పల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్యలో 2 సంవత్సరాల కింద రూ.4 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. పనులు ప్రారంభించినప్పటి నుండి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపివేశాడన్న విమ ర్శలు ఉన్నాయి.
బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుచుండగా రాకపోకలకు పక్కనే తాత్కాలి కంగా మట్టి రోడ్డు వేయగా వర్షాకాలంలో గుంతలు ఏర్పడి ప్రతి వర్షాకాలంలో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే మండలంలో కొ ల్లాపూరుకు వెళ్లే ప్రధాన రహదారి అయిన శ్రీరంగాపురం మండలం షేర్ పల్లి గ్రామ శివారులో రూ.7 కోట్ల 50 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు.
గత 2 సంవత్సరాల కింద పనులు ప్రారంభించగా మొత్తం కాంట్రాక్టర్ కి రూ 6 కోట్ల రూపాయలు ప్ర భుత్వం బిల్లులు చెల్లించింది. ఇంకా కోటి 50 లక్షలు బిల్లు పెండింగ్లో ఉండగా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే ఆపేశారు. దీంతో కొల్లాపూర్ కు వెళ్లే వాహనదారులతోపాటు సమీప గ్రామాలలోని ప్రజలు గత రెండు సంవత్సరాల నుండి వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దమందడి
వనపర్తి నియోజకవర్గం పెద్ద మందడి మండల పరిధిలోని పలు గ్రామాలలో లో లెవెల్ వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నా యి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఆ వంతెనల పై ఉధృతంగా వరదనీరు ప్రవహించి పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
ప్రధానంగా మండలంలోని జగత్ పల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద వంతెనపై వరద నీరు ప్రవహించి వర్షాకాలంలో ప్రతి ఏట రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడుతుంది. ఇదే మండలంలో పెద్దమందడి నుండి అల్వాలకు వెళ్లే రహదారిలో రెండు బ్రిడ్జీలు పూర్తిగా లో లెవల్ స్థా యిలో ఉన్నాయి. వర్షాకాలంలో ఆ గ్రామానికి వెళ్ళే వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.