calender_icon.png 2 September, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో మహాగర్జన సన్నాహక సదస్సు

02-09-2025 12:21:35 AM

 ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

వేములవాడ టౌన్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) జిల్లాలో వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో మహాగర్జన సన్నాక సదస్సు జరిగింది. సడిమెల శోభారాణి వికలాంగుల హక్కుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొని వికలాంగులకు పెన్షన్ 6000/- వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, డయాలసిస్ రోగులకు పెన్షన్ 4000 ఇవ్వాలని, కండరాల క్షీణత కలిగిన వారికి నెలకు 15000 ఇవ్వాలని గతంలో కోరడం జరిగిందన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 20 నెలలు గడుస్తున్న పెన్షన్లు పెంచకుండా నేటికీ 40 లక్షల పెన్షన్ దారులను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పుతున్న కాంగ్రెస్ పార్టీని నిందించవలసిన ప్రతిపక్ష నేత కేసిఆర్ మౌనంగా ఉంటున్నాడు అంటే దొరకు పెన్షన్ దారుల సమస్యలు అక్కర్లేదన్నట్లు ఫామ్ హౌస్ లో ఉంటూ కేసీఆర్ దొంగ వ్యవహారాన్ని 40 లక్షల పెన్షన్ దారులు గమనిస్తున్నారని అన్నారు.

హైదరాబాదులో నిర్వహించే మహాగర్జన సభలో వేములవాడ నియోజక వర్గం నుండి పెన్షన్ దారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీసి మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్ట రవి మాదిగ, ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, గుండా తామస్ మాదిగ, ఆవు నూరి ప్రభాకర్ మాదిగ, ఎనుగందుల బిక్షపతి మాదిగ, జింక శ్రీధర్ మాదిగ, సామర్ల ప్రతాప్ మాదిగ, సాహిత్య, దేవ రాములు, దెయ్యాల నారాయణ మాదిగ, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.