28-05-2025 01:15:46 AM
- శ్మశానానికి దారి గోస
- కనీస సౌకర్యాలు లేక ప్రజల ఇబ్బందులు
- కరెంట్ సౌకర్యం లేక రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బంది
కరీంనగర్, మే 27 (విజయ క్రాంతి): ఎవరైన చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వ హించుకునేందుకు స్మశానవాటికకు వెళ్లేందు కు సరైన దారిలేక దుర్శేడ్ గ్రామస్తులు ఇ బ్బందులు పడుతున్నారు.
స్మశాన వాటికలో సైతం సరైన సౌకర్యాలు లేకపోవడంతో అం తినంస్కారాలు నిర్వహించుందుకు ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అంత్యక్రియల తర్వాత కనీసం స్నానాలు చేయడానికి కూ డా ఎలాంటి వసతులు లేవు. స్మశాన వాటికకు నీటిని సరఫరా చేసే పైపులైన్ చెడిపోయి ఐదు నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథు డే కరువయ్యాడు.
స్మశాన వాటికలో విద్యు త్ దీపాలు వెలగడం లేదు, స్మశాన వాటికలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు, తేళ్లు తిరుగుతున్నాయని, కాలు మోపడానికి కూడా సందు లేకుండా చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతుందని గ్రామస్తులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో అంతిమ నస్కారాలు చేయాలంటే వాహనాలను నిలిపి వాటి వెలుతురులో అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్శేడ్ గ్రామం ఇటీవల కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేయగా, కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి స్మశాన వాటికలో సరైన వసతులు, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
స్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలి...
దుర్శేడ్ వార్డు పరిధిలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు జరుపుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విలీన గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులను కేటాయించి విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి.
సుంకిశాల సంపత్ రావు, దుర్శేడ్ మాజీ ఉపసర్పంచ్