calender_icon.png 24 November, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయాన్ని అందించిన వ్యూహాలు!

20-11-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

* సామాజిక న్యాయం పాటించడంలో తమకు ఎవరు సాటి లేరంటూ జూబ్లీహిల్స్‌లో బలమైన బీసీ యాదవ బిడ్డ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసి చిత్తశుద్ధిని చాటింది. అదే కృతజ్ఞతతో నాలుగైదు ఫాలుగా దరిచేరని విజయం కాంగ్రెస్ రిజర్వేషన్ల ఎజెండాను ఎత్తుకోవడంతో పార్టీలకతీతంగా బీసీలు నవీన్ గెలుపుకు తోడయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రేవంత్ ధాటికి ప్రత్యర్థులు హడలెత్తిపోతున్నారు. కాళేశ్వరంపై కమీషన్ , ఫోన్ ట్యాపింగ్ , ఈకార్ రేస్ లాంటి అవినీతి, అక్ర మ ఆరోపణలతో కుంగిపోయిన బీఆర్‌ఎస్ చావుకొచ్చిన ఉపఎన్నిక ఫలితం పుం డు మీద కారం చల్లినట్టుగా ఉంది. కేసీఆర్ తనయ కవిత రోజుకో అవినీతి ఆరోపణలతో పార్టీ ఉనికికే ప్రమాదం కొట్టొచ్చి నట్టుగా కనిపిస్తున్నది.

ఇప్పటికే పార్టీ పిరాయింపులతో 10మంది ఎమ్మెల్యేలను కో ల్పోయి చతికలపడ్డ బీఆర్‌ఎస్ పార్టీ మనుగడకోసం జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును చేజిక్కించుకోవాలని కన్న పగటి కలలు ఫలితంతో అడియాసలయ్యాయి. అసలే అవినీతి ఆరోపణలతో బిక్కుబిక్కు మంటు న్న బీఆర్‌ఎస్ పార్టీకి.. కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నందుకు అనుకూల పరిస్థితులు దాపరించాయి.

దురదృష్టవశాత్తు లాస్య నందిత మరణంతో అంతకముందు వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి హైదరాబాద్‌లో తొలి సీటుతో బోణీ కొట్టింది. అయి తే అదే 2023 అసెంబ్లీ ఎన్నికలో ఇదే కంటోన్మెంట్  నియోజకవర్గంలో సామాజిక ఉద్యమకారుడు గద్దర్ తనయ వెన్నెల కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పటికీ మూ డో స్థానానికే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు కేవలం 16.72 శాతం మాత్రమే. ఇక బీజేపీ 33.64 శాతం ఓటు షేరుతో రెండో స్థానంలో నిలిచింది.

బీఆర్‌ఎస్ మాత్రం 47.52 శాతం ఓట్లు సాధించి విజయాన్ని అందుకుంది. అలాంటిది కేవలం ఏడాది తిరగకముందే జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ మూడవ స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థి శ్రీ గణేష్ 40.86 శాతం ఓట్లతో విజయ దుందుభి మోగించారు. కేకే సర్వే తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆశలు సన్నగిల్లినా ఒక సీఎం రేవంత్‌కు మాత్రం విశ్వాసం ఉంది. తాజాగా జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో విజయఢంకా మోగించడం ద్వారా సీఎం రేవంత్ తన నాయకత్వానికి తిరుగులేదని దేశానికి చాటి చెప్పారు. 

న్యాయ పోరాటం..

78 ఏళ్ల పాలనలో బడుగులకు ఏ పార్టీ కూడా ఒరగబెట్టింది ఏమిలేదు, అందులో 2/3 వంతు దేశాన్ని పరిపాలించింది కాం గ్రెస్ పార్టీనే. బడుగులకు అన్యాయం జరుగుతుందని, వాళ్ల వాటా వాళ్ళకి ఎందుకు ఇవ్వొద్దు? దీనికి కులగణన లేకపోవడమే కారణమని భావించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 2023లో ఎన్నికల సందర్భంగా కులగణనకు జై కొట్టారు. మనువా దుల దాటికి కేంద్రంలో అధికారం రాకపోవడం వేరే విషయం.

అయినా ఇచ్చిన మాట కోసం చిత్తశుద్ధితో అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ జాతీయ పార్టీ తెలంగాణ లో కులగణణ చేపట్టాలని రేవంత్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాదు 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలుకు కూడా రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ముం దుగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అమ లు కోసం రెండు బిల్లులు శాసనసభ సాక్షి గా ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తే,  తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురిచేసింది.

ఈ విషయా న్ని ఎనిమిది నెలలుగా తొక్కిపెట్టి ఎ లాం టి నిర్ణయం తీసుకోలేదు. అయినా రేవంత్ ప్రభుత్వం అత్యవసర మంత్రిమండలి స మావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తేవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే రాజ్ భవన్ కేంద్రంగా ఆమోదించకుండా పక్కనపెట్టింది. అయినా బీసీల కోసం రాజ్యాం గంలోని ఆర్టికల్ 285 (ఏ) ప్రకారం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి జీవో 9 ద్వారా నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్ వ్య తిరేకులు న్యాయపరమైన చిక్కులను అడ్డు గా పెట్టి అపహాస్యం చేశారు. అటు ప్రభు త్వం, ఇటు బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఇప్పటికీ న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 

ఫలించిన బీసీ వాదం

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వివిధ పా ర్టీల ప్రోత్సాహంతో 58 మంది రంగంలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే కొనసాగింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఐదు సార్లు జరిగినప్పటికీ.. ఈసారి ఉప ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అయితే ముందు నుంచి అనుకున్నట్లుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనుసరిం చిన వ్యూహాలతో బీఆర్‌ఎస్,బీజేపీ గిలగిల కొట్టుకొని ఓటమి పాలయ్యాయి.

బీజేపీకి 2023లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే 7 శాతం తక్కువగా రాగా.. ఆయా ఓట్లు ఏ ఒ క్క పార్టీకి బదిలీ కాలేదు. అంతేకాదు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమానులు, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండ డంతో పాటు బడుగులకు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ కులగణన అంశం, 42 శా తం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామనే సం కేతం ఇవ్వడం ఫలితాన్నిచ్చింది. మరో ము ఖ్యమైన అంశం ఏంటంటే ఆ ప్రాంతం లో బడుగుల ఆరాధ్య దేవుడిగా పేరుపొందిన ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహం ప్రతిష్టాప న చేస్తానని హామీ ఇచ్చారు.

దీంతో బీసీ వాదానికి నియోజకవర్గ ప్రజలు జైకొట్టా రు. గెలుపు బీసీలదే అనడానికి, బలంగా నమ్మడానికి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చి ఓటమి చవి చూ సింది. అయితే రేవంత్ నాయకత్వంలో మళ్లీ తప్పిదం జరగలేదు . అందరు అనుకున్నట్లుగా జూబ్లీ హిల్స్‌లో రిచ్ వర్గం మాత్రమే ఉండదు. ఓటర్లలో ఎక్కువభా గం  చిరుద్యోగులు, సినీ కార్మికులు, చిరు వ్యాపారాలు, రెక్కాడితే గానీ డొక్కాడని శ్రా మికులు ఉన్నారు.

నాలుగు లక్షల ఓట్లలో బలహీనవర్గాల ప్రజలు ఒక లక్ష నలభై వేల మంది ఉంటే, మైనార్టీలు 80వేల వరకు ఉన్నారు. అం దులో 35 వేల మం ది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. నిమ్న కులాలకు చెందినవారు మిగతా ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బలమై న సామాజిక వర్గాల ఓటర్లను రేవంత్ ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యారు.

చీలిన ఓట్లు!

సామాజిక న్యాయం పాటించడంలో తమకు ఎవరు సాటి లేరంటూ జూబ్లీహి ల్స్‌లో బలమైన బీసీ యాదవ బిడ్డ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసి చిత్తశుద్ధిని చాటింది. అదే కృతజ్ఞతతో నాలుగైదు దఫాలుగా దరిచేరని విజ యం కాంగ్రెస్ రిజర్వేషన్ల ఎజెండాను ఎత్తుకోవడంతో పార్టీలకతీతంగా బీసీలు నవీన్ గెలుపుకు తోడయ్యారు. కాంగ్రెస్ అనూహ్యంగా దాదా పు 51శాతం ఓట్లు సాధించి తిరుగులేదని నిరూపించింది.

ఇన్నాళ్లు రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ఖర్గే ఏదో అన్నాడని కారు కూతలు కూసిన ప్రత్యర్థులు జూబ్లీహిల్స్ విజయఢంకా, అధిష్టానం ఇచ్చిన ట్రీట్ తో నివ్వెరపోయారు. బీసీ వాదంతో పాటు ఎంఐఎం పోటీ చేయకపోవడం, అభ్యర్థి తండ్రి  శ్రీశై లం యాదవ్ గతంలో టీడీపీ లో పనిచేయడం, జనసేన, టీడీపీ ఓట్లు చీలి కాంగ్రె స్ గెలుపుకు కారణమయ్యాయి. ‘నాకు రాజకీయాల్లో లోతులు తెలియవని అనుకోవద్దు..

రాజకీయం చేయడం రాదు అనుకోవద్దు’ అని చెప్పినట్టే నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించిన సీఎం రేవంత్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ప్రచార సమయంలో ఒక విషయాన్ని గమనించిన రేవంత్ చివరి వారంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మైనార్టీ శాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు అవకాశమిచ్చి 51 శాతం ఓట్లతో ఘన విజయాన్ని అందించారు.

ఒక విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రె స్ అనుసరించిన వ్యూహాలకు బీసీ నినాదం కూడా కలిసి వచ్చింది. ఇక అధికారం కోల్పోయామని ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు చేసిన రాద్ధాంతం, విషప్రచారం, వ్యంగ్యాస్త్రాలు, హామీలపై నినదించడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహద పడిందని చెప్పొచ్చు.

 వ్యాసకర్త సెల్ : 9866255355