calender_icon.png 15 September, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ మాయలో యువత

25-06-2025 12:00:00 AM

ప్రస్తుతం అత్యంత తీవ్ర ప్రభావం చూపుతున్న అలవాట్లలో మొబైల్ వాడకం ఒకటి. చాలామంది వీటితో గడుపుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మనుషులనే మొబైల్స్ దారుణంగా వాడుకుంటున్న పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తికాదు. చిన్నల నుంచి పెద్దల వరకు, మరీ ముఖ్యంగా టీనేజ్ యువత వీటికి పెద్ద ఎత్తున బానిసలవుతున్నారు. గంటల కొద్దీ అనవసరమైన, పనికిమాలిన విషయాలతో కాలక్షేపం చేస్తున్న వారెందరో.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియా మాయలో ప్రతీ ఒక్కరూ పడిపోతున్నారు. విద్వేషపూరితమైన, అసందర్భ విషయాలను అనేక రకాలుగా పోస్టులు పెడుతూ, షేర్లు చేస్తూ వికృతానందాన్ని పొందుతున్నారు. సెల్లు లోకంలో పడిపోయే వారు ఇక, కనీసం పక్కన ఉన్నవారిని పట్టించుకోవడం లేదు. ప్రేమగా, ఆపాయ్యంగా పలకరించే పాపాన కూడా పోవడం లేదు. మానవీయ విలువలను సైతం మొబైల్స్ పక్కదారి పట్టిస్తుండటం బాధాకరం.

 కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా