calender_icon.png 30 January, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణను అవమానపరచడమే

30-01-2026 12:30:48 AM

మాజీ ఎంపీ లింగయ్యయాదవ్

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, జనవరి 29 : తెలంగాణ ఉద్యమ రధసారధి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం తెలంగాణాను అవమానపరచడమేనని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మిర్యాలగూడ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ విషయంపై నోటీసులు జారీ చేసి మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నోటీసులు అని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, 420 హామీలు అమ లుకు నోచుకోలేదని, వీటిలో బాలికలకు స్కూటీలు, కల్యాణలక్ష్మీ తులంబంగారం, వృద్ధాప్య పింఛన్ల పెంపు ఊసే లేదన్నారు. 

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.అనంతరం 32మంది అభ్యర్థులతో మున్సిపల్ ఎన్నికల జాబితాను విడుదల చేశారు. ఈ సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి(, రాంబో), వీరకోటిరెడ్డి, పాలుట్ల బాబయ్య, నల్లమోతు సిద్ధార్థ, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు తుమ్మల ఫణి కుమార్  తదితరులు ఉన్నారు.