30-01-2026 12:30:11 AM
ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): దేశ ఆర్థికాభివృద్ధికి రెండు దశాబ్దా లకు పైగా అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫొరం(ఎఐఎవిఐఎఫ్) ఎంతో కృషి చేస్తున్నదని ఎఐఎవిఐఎఫ్ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. ప్రభుత్వ సహాకారంతో రానున్న రోజుల్లో యువతకు పారిశ్రామిక రంగంలో మెళకువలు నేర్పించడంతో పాటు ఎంఎస్‌ఏంఈ లకు ప్రోత్సా హం అందిస్తామని చెప్పరు. ఎఐఎవిఐఎఫ్ రజతోత్సవాలను ఫిబ్రవరి 1న నానక్ రామ్ గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ’ప్రధాన్ కన్వెన్షన్’లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటిం చారు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం రజతోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరిం చారు. ఈ సమావేశంలో ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బత్తుల, సంయుక్త కార్యదర్శి కాశి విశ్వనాధం చింత, ట్రెజరర్ విజయ ప్రసాద్ గుంపల్లి, కన్వీనర్ మంచి రాజశేఖర్, మీడియా చైర్మన్ ఎర్రం బాలకృష్ణ తదితరు లు పాల్గొన్నారు.