08-08-2025 12:00:00 AM
సూర్యాపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో ఓపికగా విద్యాబుద్ధులు నేర్పడం అభినందనీయమని సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని కాసరబాద రోడ్ లో గల అపూర్వ బధిరులపాఠశాలలో వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్, పెన్స్, పెన్సిల్స్, శాలు వాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు చేసే సేవ సాక్షాత్తు భగవంతుడికి చేసే సేవేనని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ముందుగా రక్షాబంధన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్య క్షులు తీకుళ్ల సాయిరెడ్డి, పాఠశాల వ్యవస్థాపకులు మదనాచారి, పచ్చిపాల శ్రీనివాస్, శేరి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.