10-12-2025 12:00:00 AM
మునిపల్లి, డిసెంబర్ 9 : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని బుదే రా చౌరస్తాలో ఎస్‌ఐ రాజేష్ నాయక్, ఎఫ్‌ఎస్టి (ఫ్లైయింగ్ స్క్వాడ్) ప్రదీప్ లు మం గళవారం వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని పెద్దలోడి గ్రామానికి చెందిన పెద్దగొల్ల దస్సయ్య అనే వ్యక్తి రూ.లక్ష నగదును కారులో తీసుకెళ్తుండగా తనిఖీలో ప ట్టుకున్నారు. ఈ సందర్భంగా నగదుకు సం బంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వేళ పత్రాలు లేకుండా నగదు తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ తనిఖీలో అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.