calender_icon.png 9 August, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి కెనాల్‌కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

08-08-2025 01:09:16 AM

నిర్మల్, ఆగస్టు ౭ (విజయక్రాంతి): శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సరస్వతి కాలువ ద్వారా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగువకు నీటిని  గురువారం విడుదల చేశారు. అంతకు ముందు ప్రాజెక్టు వద్ద శ్రీరాంసాగర్ లో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. సరస్వతి కెనాల్ పరివాహక ప్రాంత రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్,  మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, చిన్నయ్య, నాయకులు సరికెల గంగన్న, హరీష్ రెడ్డి, అడ్వాల రమేష్, రాజేశ్వర్, ముత్యం రెడ్డి, రమేష్ రెడ్డి, నర్సారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సాగర్, అశోక్, జీవన్ రెడ్డి, నవీన్, నరేష్, ఇరిగేషన్ ఈఈ అనిల్, డిఈ నరేష్, ఏఈ తో పాటు తదితరులు పాల్గొన్నారు.