19-08-2025 12:28:51 AM
వాషింగ్టన్, ఆగస్టు 18: ట్రంప్‌తో సమావేశానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రష్యానే మొదట యుద్ధం మొదలుపెట్టింది కనుక యుద్ధం ఆపాల్సింది కూడా రష్యానే’ అని పేర్కొన్నారు. అంతకు ముందు ట్రంప్ ఈ భేటీపై స్పంది స్తూ.. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్ నాటోలో చేరే ఆంశం గురించి మర్చిపోవాలి.
అంతే కాకుండా క్రిమియాను కూడా మర్చిపోవాలి. అలాగైతేనే ఈ దేశాల నడుమ శాంతి నెలకొంటుంది’ అ ని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల మీద జెలెన్‌స్కీ స్పందించారు. ‘ఉక్రెయిన్‌ను రక్షించుకుంటానన్న నమ్మకం నాకు ఉంది. అదే సమయంలో మా భద్రతకు హామీ పొందుతాననే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
జెలెన్‌స్కీ వెంట యురోపియన్ నేతలు కూడా వాషింగ్టన్ చేరుకున్నారు. యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫిన్లాండ్ ప్రధాని స్టబ్, ఇటలీ ప్రధాని మెలోని జెలెన్‌స్కీతో పాటు వచ్చారు.
డోన్బాస్ రష్యాకే!
వివాదాస్పదంగా ఉన్న డోన్బాస్ ప్రాంతా న్ని రష్యాకు ఇవ్వాలని ట్రంప్ ఇప్పటికే జెలెన్‌స్కీకి తెలియజేసినట్టు సమాచారం. తూ ర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకం అని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించా యి. ఈ నెల 22వ తేదీన త్రైపాక్షిక సమావే శం నిర్వహించాలని ట్రంప్ భావిస్తున్నారు.