19-08-2025 12:32:02 AM
పాట్నా, ఆగస్టు 18: పత్యేక సమగ్ర సవరణ (సర్) ఓట్లను చోరీ చేసేందుకు కొత్త ఆయుధమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీని అడ్డుకుని తీరుతామని వాట్సాప్ చానల్‌లో హామీనిచ్చారు. కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ అధికార్’ యాత్ర సోమవారం ఔరంగాబాద్ నుంచి పునఃప్రారంభం అయింది. ఔరంగాబాద్‌లోని ప్రముఖ సూర్య దేవాలయంలో పూజల అనంతరం రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ యాత్రను కొనసాగించారు.
మార్గ మధ్యలో వారితో వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ) పార్టీ అధినేత ముఖేష్ సహాని, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రాం జాయిన్ అయ్యారు. తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో యా త్రకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా యాత్రను తన మద్దతు తెలిపారు. యాత్రకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.