10-12-2024 05:30:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిక కార్యక్రమాల పేరిట సినియా పాటలు పాడించారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరవై సంవత్సరాలు ఈ మత్తులో పడి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసి, తెలంగాణ భాష, యాసను తోక్కేశారన్నారు. సోమవారం రాత్రి జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఒక్కరిలోనైనా ఉద్యమ భావోద్వేగాలు కనిపించాయా..?, సంబురాల్లో జై తెలంగాణ అని ఎవరైనా అన్నారా..? అని ప్రశ్నించారు. ద్రోహుల చెంత చేరి తెలంగాణ తల్లికి మోసం చేయవద్దని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు ప్రచారం కోసం కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిపై మరోమారు భయంకారమైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.