calender_icon.png 28 July, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ పీఎంపై పోరాటం చేసిన 26 ఏళ్ల కుర్రాడు

06-08-2024 04:16:28 PM

ఢాకా: బంగ్లా దేశ్ జాతీయ పతాకాన్ని తలకు చుట్టుకున్న ఈ కుర్రాడి పేరు నహీద్ ఇస్లామ్...చదివింది ఢాకా విశ్వ విద్యాలయంలో సోషియాలజీ... కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్గా మారిన పేరు.  ఈ ఏడాది జూలైలో బంగ్లా దేశ్ స్వాతంత్ర సమరంలో పోరాడిన వారి వారసులకు సివిల్ సర్వీసులలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటానికి నహీద్ నాయకత్వం వహించాడు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందగా బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ ఈ చట్టాన్ని రూపొందించారు. మూడో తరంవారి వారసులకు సైతం సివిల్ సర్వీసులలో రిజర్వేషన్‌లు ఎందుకు అని ఆయన నినదానికి బంగ్లా యువత మొత్తం కదలి వచ్చింది