04-09-2025 01:07:03 AM
ఎన్నికైన వారిని అభినందించిన టీజీవో అధ్యక్షుడు ఏలూరి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ కార్మికశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బీ.జాసన్, కార్యదర్శిగా శ్యాంసుందర్ ఎన్నికయ్యారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి ఏ.సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బీ.శ్యామ్ సమక్షంలో బుధవారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో రాష్ట్రస్థాయి ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహా అధ్యక్షులుగా ఎన్.చంద్రశేఖర్ గౌడ్, కోశాధికారిగా కే.యాదయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్.శ్రీనివాస రావు, సహకార్యదర్శులుగా కే.రవీందర్ రెడ్డి, ఏ.సత్యనారాయణరెడ్డితోపాటు మరికొంత మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తూనే ప్రజలలో భాగమై మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.