24-09-2025 12:00:00 AM
బీసీ కులాల సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బీసీ సంఘంలోని 33 కులాలన్నీ ఒకే వేదికగా ఉండి కార్యకలాపాలు నిర్వహించేందుకు బీసీ కుల సముదాయ భవన నిర్మాణ పనులను 3 నెలల్లో పూర్తి చేసి ఆయా కుల సంఘాలకు భవనాలను అప్పగించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లో బీసీ కుల సంఘాల భవన నిర్మాణ సముదాయాన్ని బీసీ సంఘం నాయకులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించా రు. ఈ సందర్భంగా పనుల పురోగతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భవవంలో కలియ తిరుగుతూ పనులను పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మె ల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... పనులను మూడు నెలల్లో పూర్తి చేసే దిశగా అధి కారులు సైతం చర్యలు చేపట్టాలని సూచించారు. మరో మూడు, నాలుగు బీసీలోని కుల సంఘాల భవనాలకు సైతం ఇదే ప్రాం తాల్లో భవనాలు నిర్మించేందుకు మరో 60 లక్షలతో అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం సైతం చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వెనుకబడిన బీసీ కులాల అభి వృద్ధి కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు దత్తు, నర్సా గౌడ్, అశోక్, నర్సములు, బీజేపీ నాయకులు ఉన్నారు.